ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం మే 5 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు పాలు పెరుగు తేనె హరిద్రవం తో కూడిన అభిషేకం నిర్వహించారు. పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఉభయ దాతలుగా పచ్చికాపలం గ్రామానికి చెందిన చిట్టెమ్మ వేణుగోపాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్ కార్యనిర్వహణాధికారి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, వినయ్ గోవింద్ స్వామి సెల్వి అమరావతి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!