ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు,మహిళ కార్యకర్తలు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు,మహిళ కార్యకర్తలు

📰 Generate e-Paper Clip

– ప్రజా నాయకుడు, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం

– అడుగడుగునా పుష్పాంజలితో స్వాగతం పలికిన టిడిపి మహిళా కార్యకర్తలు

నారాయణవనం జూలై 24 (గరుడదాత్రి న్యూస్) మండల కేంద్రమైన నారాయణవనంలోని చావడి వద్ద నుండి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు శుక్రవారం టిడిపి నాయకులు, టిడిపి మహిళా కార్యకర్తలు, అనుచరులు అభిమానులు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. చావడి వద్ద నుండి బాలుర హై స్కూల్ వరకు టిడిపి నాయకులు కార్యకర్తలు, కూటమి నాయకులు ప్రజలు అభిమానులు తో జన సముద్రంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్యవేడు నియోజవర్గంలో అన్ని స్థానాలను అందరిని కలుపుకొని ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసే ఎమ్మెల్యే ఆదిమూలం ఆధ్వర్యంలోనే టిడిపి పార్టీ కైవసం చేసుకుంటుందని సత్యవేడు నియోజకవర్గంలోని అన్ని మండలాల టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలోనే టిడిపి పార్టీ ముందుకు తీసుకుపోతుందని తద్వారా సత్యవేడు నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికలలో పాటు ఎమ్మెల్యే ఎన్నికలలో టిడిపి ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!