ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగరంగ వైభవంగా ప్రారంభమైన భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయోగం

అంగరంగ వైభవంగా ప్రారంభమైన భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయోగం

📰 Generate e-Paper Clip

నారాయణవనం సెప్టెంబర్ 15 (గరుడదాత్రి న్యూస్) పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణంలో జరుగుతున్న భారత విశ్వ గురు సంకల్పసిద్ధి మహాయోగం మొదటిరోజు మంగళవారం “అకల్మష హోమం” 200 25 మంది వేద ఆగమ పండితుల ఆధ్వర్యంలో కొండూరు అశోక రాజు వారి సతీమణి ఇందిరావేణి దంపతులచే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు 255 మంది వేద పండితులతో ఆకల్మష హోమం నిర్వహించారు. ఈ హోమంలో భాగంగా పంచగవ్య ప్రాసన, వాస్తు హోమం, దీక్ష స్వీకరణ, కంకణ ధారణ, పంచామృత అభిషేకం, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ అంబటి పూడి రాధేశ్యామ్ శర్మ విచ్చేసి భక్తులు, విద్యార్థులు,అధ్యాపకులను ఉద్దేశించి భారత విశ్వ గురుత్వము మరియు సనాతన ధర్మం అనే అంశంపై ప్రవచనాలు తెలియజేశారు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు 255 మంది వేద పండితులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో భాగంగా విశ్వక్షణ పూజ, పుణ్యవచనం, అగ్ని మధనం, కుంభ ప్రతిష్ట, వెంకటేశ్వర మూలవిరాట్ సంప్రోక్షణ, కుంభ ఆరాధనం, సమస్త గ్రహ పీడిత పరిహారక, నవగ్రహ మూల మంత్ర హోమం, చతుర్వేద పారాయణం, రామాయణ సుందరకాండ, భగవత అరుణ పారాయణం, మహా నైవేద్యం మహా మంగళ హారతితో పాటు తీర్థప్రసాద వినియోగం కార్యక్రమంతో సంపూర్ణంగా ముగించడం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ రాజు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాసు మోదీ” భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయోగం ” తొమ్మిది రోజులపాటు నవా హ్నక దీక్ష 15 –
9- 2006 నుండి 23- 9 – 2026 వరకు 20025 మంది వేద ఆగమ పండితులతో 115 హోమం గుండాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని భక్తులు తో పాటు ప్రతి ఒక్కరూ ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దైవ కృప పొందుతారని ఆశిస్తూ అందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!