ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోవడమే నా ధ్యేయం జడ్ పి టీ సి అభ్యర్థి హేమలత

అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోవడమే నా ధ్యేయం జడ్ పి టీ సి అభ్యర్థి హేమలత

📰 Generate e-Paper Clip

నాగలాపురం, గరుడ ధాత్రి న్యూస్ :
నాగలాపురం మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ, అచ్చమనాయుడు కండ్రిగ, చినాపట్టు తదితర గ్రామాలలో ప్రచారం సైకిల్‌కి జోరుగా సాగింది. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ బాబు రావాలి జాబు రావాలి అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరిగింది. సూపర్ సిక్స్ ప్రతి పేదవాడికి అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి అచ్చమనాయుడు కండ్రిగలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగించారు. టిడిపి ప్రభుత్వం ప్రతి పేద వాడికి సంక్షేమ పథకాలు లబ్దిపొందేలా చర్యలు తీసుకుంటుందని నాగలాపురం, టిడి పాలెం, చిన్న పాందూరు రోడ్డు అభివృద్ధి చేస్తున్నామన్నారు. హేమలతని అఖండ భారీ మెజారీటీలో గెలిపిస్తే ప్రతి పల్లెల్లో అభివృద్ధి జరిగేలా ఆమె చేస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చినా పట్టు ఎంపిటిసి అభ్యర్థి జ్యోతి, హేమలతను అఖండ భారీ మెజారీటీలో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుబ్రమణ్యం రాజు, నాగలాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జాన్సన్, క్లస్టర్ ఇంచార్జి శ్రీనివాసులు యాదవ్, పళ్లికొండేశ్వర బోర్డు సభ్యులు శ్రీనివాసులు నాయుడు, చంచమ నాయుడు, రాజమాణిక్య శెట్టి, పార్థిబన్, పరశురాం శిల్పి, ఎక్స్ ఎంపిపి అన్షు, దేవానందం, రాకేష్ రెడ్డి, బాబు, భారీ సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
​

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!