ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆడి కృతిక భక్తుల కోసం క్యూ లైన్ ఏర్పాటు

ఆడి కృతిక భక్తుల కోసం క్యూ లైన్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 2 (గరుడదాద్రి న్యూస్):

కార్వేటినగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా భక్తులకు నూతనంగా క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి గర్భిణీ స్త్రీల కొరకు, వయోవృద్ధులు, బాలింత తల్లులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ను ఏర్పాటు చేశాము. ఇలాగే భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేవిధంగా ఏర్పాటు చేశాము.
స్వామివారి దర్శన పూర్తి వివరాలను తెలిపే విధంగా మండపం వీధి దగ్గర మరియు కొండకు వెళ్లే మార్గంలో బోర్డులను ఏర్పాటు చేశాము.
కళ్యాణకట్ట, స్కంద పుష్కరిణి వద్ద మరియు ఆలయ పరిసర ప్రాంతాలలో శుభ్రం చేయడం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!