ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇంటింటా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ఇంటింటా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

టిడిపి మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వెంకటాచలం

రామ కుప్పం ఆగస్టు 13 గరుడ ధాత్రి న్యూస్

ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పి వెంకటాచలం పేర్కొన్నారు గురువారం ముద్దనపల్లి పంచాయతీ ఆవులు కుప్పం గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తించారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొన్నారు ఇదిలా ఉండగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పార్టీ కార్యదర్శి వెంకటేష్ పంచాయతీ యువత అధ్యక్షులు బాలాజీ బూత్ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!