కార్వేటినగరం ఆగస్టు 12 గరుడదాద్రి న్యూస్
ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET- 2026)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డి.ఎల్.ఎడ్. కళాశాలలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ నిమిత్తం రెండవ దశ కౌన్సెలింగ్ నిర్వహించబడుతున్నది.
రెండవ దశ కౌన్సెలింగ్లో భాగంగా అర్హత సాధించిన అభ్యర్థులు 13-08-2026 నుండి 16-08-2026
వరకు వెబ్ ఆధారిత (Web-Based) ఆప్షన్లు నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా 17-08-2026 నుండి 20-08-2026 వరకు సీట్ల కేటాయింపు (Seat Allotment) నిర్వహించబడును. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను (Provisional Admission Letters) అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు 21-08-2026 నుండి 24-08-2026 వరకు సంబంధిత ప్రభుత్వ
డైట్ (DIET) కళాశాలలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం (Final Admission Letter) పొందవలెను. డి.ఎల్.ఎడ్. మొదటి సంవత్సరం తరగతుల మొదటి రోజు బోధన 27-08-2026 నుండి ప్రారంభమగును. కావున, AP DEECET-2026లో అర్హత సాధించిన మరియు రెండవ దశ కౌన్సెలింగ్కు అర్హులైన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని, సీట్లు కేటాయించబడిన పక్షంలో నిర్ణీత తేదీలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై, తమకు కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోగా ప్రవేశం పొందవలసిందిగా డైట్, కార్వేటినగరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డీ.కే. దామోదర్ రావు గారు మరియు సూపెరిటెండెంట్ ప్రేమ కుమారి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
