ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

📰 Generate e-Paper Clip

నాగలాపురం మండలం జానకాపురం గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేట్ డాక్టర్ ముత్యాల చిన్ని కృష్ణుడు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ దేవత అంకాల పరమేశ్వరి జాతర సందర్భంగా ఈ శిబిరాన్ని కార్యనిర్వాహకుడు ప్రతాప్ నాయుడు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి. రామచంద్రన్ (ఎంబిబిఎస్, నాగలాపురం) హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు సేవాభావంతో ప్రతాప్ నాయుడు ఈ శిబిరాన్ని నిర్వహించడం విశేషం.
శిబిరంలో పలు వైద్య విభాగాలకు చెందిన ఉచిత సేవలు అందించారు:
తిరుపతికి చెందిన అగర్వాల్ హై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
డి.బి.ఆర్ హాస్పిటల్, తిరుపతి వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్. ప్రవీణ్ కుమార్ రెడ్డి (ఎండీ, డీఎం – ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్) ఉచిత గుండె పరీక్షలు నిర్వహించి, ఈసీజీతో పాటు అవసరమైన మందులు అందించారు.
డాక్టర్ మధు కృష్ణారెడ్డి (ఎంఎస్ ఆర్థో) ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్లు, నరాల సంబంధిత సమస్యలకు వైద్య సేవలు అందించారు.
డాక్టర్ రేణుక (బీడీఎస్, నాగలాపురం) ద్వారా ఉచిత దంత వైద్య సేవలు అందించగా, డాక్టర్ సి. జయప్రకాశ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం కూడా నిర్వహించారు.
ఈ వైద్య శిబిరానికి జానకాపురం మరియు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవలు పొందారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతాప్ నాయుడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
గ్రామస్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం స్థానికంగా మంచి స్పందన పొందింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!