ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశ కల్పించిన కూటమి ప్రభుత్వం...

ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశ కల్పించిన కూటమి ప్రభుత్వం…

📰 Generate e-Paper Clip

ఏపీ జేఏసీ అమరావతి నేత టి.గోపాల్
తిరుపతి, జులై 2 :
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఈసారి కూడా నిరాశ మిగిల్చిందని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు టి గోపాల్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్టు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సుమారు 65 లక్షల మంది ఓటర్లు కోటి ఆశలతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలా ఓట్లు వేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల బాధలు వెతలు అన్యాయాలు కడ తీరుస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారన్నారు. కానీ వారి ఆశలు అడి ఆశలు అయ్యాయని పేర్కొన్నారు. కుటుంబం ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఎంతగానో ఆశపడ్డామని కానీ ఎలాంటి ప్రయోజనాలు కల్పించని ఈ ప్రభుత్వంపై అంతర్గతంగా ఆవేదనతో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు వారికి న్యాయంగా చట్టబద్ధంగా రావాల్సిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఐదు డిఏలు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయని, డి ఏ అరియర్స్ పెండింగ్, పిఆర్సి అరియర్స్ కమిటీ నియామకం ఊసే లేదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లు తీరుతాయని కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓట్లు వేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహాయపడిన ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆశలు అడియాశలు గానే మిగిలిపోతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఆవేదన చెందుతున్నారని అమరావతి జేఏసీ నేత గోపాల్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరఫున తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!