ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి

ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి

📰 Generate e-Paper Clip

పత్రికా ప్రకటన

——————-

 

*ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి*…

 

*అభివృద్ధికి బాటలు వేయండి*..

 

*హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*

 

*హోసోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు*

—————————

చిత్తూరు -20-04-26

—————————-

 

ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతుగా.. సోమవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా,హోసోర్,బాగలూరు ప్రాంతాల్లో బిజేపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 

అంతకుముందు హోసోర్ చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు ఆ ప్రాంతం బిజేపి మండలాధ్యక్షులు మోహన్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., ఎన్డీఏ కూటమి అభ్యర్థి బాలకృష్ణా రెడ్డిని గెలిపించాలని హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించారు.

 

తర్వాత జరిగిన బహిరంగ సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించు కోవడం చాలా అవసరం అన్నారు. భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడేది ఒక్క ఎన్డీఏ సర్కార్ మాత్రమే అన్నారు.

భారతావనిని ప్రగతి పథంలో నడిపించడంలో పాటు, గొప్ప గొప్ప సంస్కరణలతో ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతోందని తెలిపారు. అటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హోసోర్ ప్రాంత ప్రజలంతా మద్దతుగా నిలవాలని, బాలకృష్ణా రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

 

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో

బిజెపి నాయకులు నాగరాజు,నంజప్ప,ఆనంద, గోపి,సూర్యకుమార్, చంద్రశేఖర్,లింగన్న, అభిషేక్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!