ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడిగా బి. రవి నియామకం

ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడిగా బి. రవి నియామకం

📰 Generate e-Paper Clip

*తిరుపతి న్యాయవాది బి. రవికి కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు*

*35 ఏళ్ల సేవలకు దక్కిన గుర్తింపు.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్న సీనియర్ న్యాయవాది.*

*తిరుపతి, జూలై 20 (కాకతీయ ప్రతినిధి):*

ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, మరియు ఆర్టిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తిరుపతికి చెందిన సీనియర్ న్యాయవాది బి. రవి నియమితులయ్యారు. ఈ మేరకు 12 మంది ప్రతినిధులతో కూడిన నూతన రాష్ట్ర కమిటీ జాబితాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీ సి సి అధికారికంగా విడుదల చేసింది. గత 35 సంవత్సరాలుగా పార్టీకి సుదీర్ఘ సేవలు అందిస్తున్న బి. రవి, తిరుపతి జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పార్టీపట్ల ఆయనకున్న నిబద్ధతను, సేవలను గుర్తించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఆయనకు రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ సముచిత గౌరవాన్ని అందించింది.
*అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు:*
తన సుదీర్ఘ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించినందుకు బి. రవి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, ఏఐసీసీ కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్, మరియు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వడ్డే సోమశేఖర్‌లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో న్యాయపరమైన అంశాల్లో బాధితులకు అండగా నిలుస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు విశేష కృషి చేస్తానని ఈ సందర్భంగా బి. రవి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!