ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఏపీ ప్రభుత్వ బడుల్లో ఉచిత 'సిక్ రూమ్లు'

ఏపీ ప్రభుత్వ బడుల్లో ఉచిత ‘సిక్ రూమ్లు’

📰 Generate e-Paper Clip

* కూటమి ప్రభుత్వం నిర్ణయం.
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా ‘సిక్ రూమ్ల’ ఏర్పాటుకు నిధులు కేటాయించింది. తరగతి గదుల్లో పిల్లలకు అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి వచ్చినా లేదా ఆడుకునేటప్పుడు గాయపడినా విశ్రాంతి పొందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి బడిలో ఒక గదిని కేటాయించి బెడ్లు, ఫ్యాన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుతారు. పి. హెచ్.సి వైద్యులు, ఎన్.ఎమ్.ల అనుసంధానంతో పాటు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి తక్షణ ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఈ వినూత్న నిర్ణయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!