ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తల్లిపాలు తాగే పిల్లలకు భవిష్యత్తు మొత్తానికి పునాది

తల్లిపాలు తాగే పిల్లలకు భవిష్యత్తు మొత్తానికి పునాది

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు5

బైరెడ్డిపల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ . అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం బైరెడ్డిపల్లి 2 వ అంగన్వాడీ కేంద్రం నందు బుధవారం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు తాగించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే త్రాగించాలని , బిడ్డకి తల్లికి ఇద్దరికీ కలుగు ప్రయోజనాలు బిడ్డకు మేధోశక్తి అభివృద్ధి చెందడం ,జబ్బుల నుండి శిశువు కాపాడబడడం తల్లి బిడ్డల మధ్య ప్రేమానుబంధాలు బలపడడం ,వయసుకు తగిన విధంగా బిడ్డ ఎదుగుదల ఉండడం, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం, తల్లిపాలు తాగే పిల్లలకు ఇది భవిష్యత్తు మొత్తానికి పునాది లాంటిది తల్లికి కలుగు ప్రయోజనాలు బిడ్డకు పాలు ఇవ్వడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించవచ్చు అన్నారు గర్భసంచి యధా స్థానానికి వెళ్లి తల్లికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, బిడ్డకు పాలు ఇవ్వడం వలన త్వరగా గర్భం దాల్చకుండా ఉండడానికి కూడా ఇది దోహదం చేస్తుంది మరో ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకాల పనిచేస్తాయి పోత పాలు గాని ఏ ఇతర పానీయాలు కానీ త్రాగించకూడదు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి అరుణశ్రీ వివరించడం జరిగినది ఈ కార్యక్రమానికి బైరెడ్డిపల్లి సూపర్వైజర్ మాధవి లత అంగన్వాడీ కార్యకర్తలు కామాక్షి, మంగమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!