* 9 రోజుల్లో 25 లక్షల ఇళ్లను సందర్శించిన టిడిపి యంత్రాంగం.
* ఈ రికార్డు టిడిపి కార్యకర్తలకె సాధ్యం.
* ప్రతి నియోజక వర్గం నుంచి కొనసాగుతున్న తీరుపై నివేదికలు.
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వేగం పుంజుకుంది. 27వ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమం 9వ రోజు మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 25 లక్షల ఇళ్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు సందర్శించాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ యంత్రాంగం చేపట్టింది. పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఇంటింటిని సందర్శిస్తోంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా ప్రజలకు పార్టీ శ్రేణులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. మొత్తం ఈ కార్యక్రమం 41 రోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వేగం పుంజుకుంది. ఈ కార్యక్రమం కొనసాగుతున్న తీరపై ప్రతినిత్యం రాష్ట్ర పార్టీ కార్యాలయం సమాచారం సేకరిస్తోంది. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం ఏళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం” కార్యక్రమం లో నేతలు పార్టీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్న అంశాల తీరు గురించి కూడా పార్టీ కార్యాలయం వివరాలు సేకరిస్తోంది. ఇన్ఛార్జి లు,మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, క్షేత్రస్థాయిలో అలసత్వానికి తావులేకుండా సమన్వయంతో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ హామీల అమలు తీరును తెలియజేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశించారు.
రాష్ట్రంలో జోరు అందుకున్న’ఇంటింటికీ తెలుగుదేశం
RELATED ARTICLES
