ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఒక్కొక్క వార్డు నుండి 300 మందికి ఏమాత్రం తగ్గకుండా జనాన్ని తరలించాలి.... మాజీ ఎమ్మెల్యే...

ఒక్కొక్క వార్డు నుండి 300 మందికి ఏమాత్రం తగ్గకుండా జనాన్ని తరలించాలి…. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

📰 Generate e-Paper Clip

తిరుపతి, మే 8 :
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు తిరుపతి నగరంలోని ఒక్కొక్క వార్డు నుండి 300 మంది కార్యకర్తలకు ఏమాత్రం తగ్గకుండా జన సమీకరణ చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతలకు ఆదేశించారు. సోమవారం తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మూడవ క్లస్టర్ లోని వార్డు అధ్యక్షులు, కో యూనిట్ ఇన్చార్జిలు, కమిటీ నాయకులతో సుగుణమ్మ పులిగోరు నాగరత్నమ్మ నిలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరంలోని 50 డివిజన్ల పరిధిలో ఒక్కొక్క డివిజన్ నుంచి 300 కు ఏ మాత్రం పార్టీ కార్యకర్తలు తగ్గకుండా రెండేళ్ల పాలన సక్సెస్ సభకు తరలించాలని చెప్పారు. డివిజన్లో వారీగా సభాస్థలికి జనాలను తరలించేందుకు ఆటోలను ఏర్పాటు చేయాలని స్థానిక నేతలకు సూచించారు. పులిగోరు మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రములో రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చి ప్రజా ప్రభుత్వంగా ప్రజల ఆశీర్వాదములు ఉన్నాయన్నాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలన్నిటిని నెరవేర్చడం జరిగిందని, రాబోయే మూడేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలో తయారు కాబోతోందని పులిగోరు మురళి కృష్ణారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు, పార్టీ నాయకులు హేమంత్ కుమార్ యాదవ్, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, భరణి యాదవ్, రామదాసు ముని రామయ్య, ఆరో వార్డు అధ్యక్షులు గంజి సుధాకర్ రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ ఎస్ వి ఎం వెంకటేష్, 11వ డివిజన్ ఇంచార్జ్ పవన్ శరత్ చౌదరి, 11, 27, 32 డివిజన్ల టీడీపీ అధ్యక్షులు భాస్కర్, దేవా చారి, నాగ ప్రతాప్ మునిరాజా మునిశేఖర్ రాయల్, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!