ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కడపనత్తం రహదారి ఏర్పాటు పై హర్షం

కడపనత్తం రహదారి ఏర్పాటు పై హర్షం

📰 Generate e-Paper Clip

-నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో మండల కేంద్రం బైరెడ్డిపల్లికి చేరుకునేందుకు ప్రత్యుమ్నయ తాత్కాలిక
రహదారి లేక తీవ్ర
ఇబ్బందులు పడుతున్న8 గ్రామాల ప్రజలు.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్23

బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తంకు చాలా కాలంగా రాకపోకలకు ఉన్న రహదారి దెబ్బ తిన్న పట్టించుకొనే నాధుడు కరువైయ్యారు. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో ఈ రహదారికి మోక్షం కలిగి ప్రస్తుతం రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీనితో 9 గ్రామాల ప్రజలు ఆనందంకు గురైయ్యారు.ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని సంబరపడ్డారు.కానీ 8 గ్రామాల ప్రజలు ప్రతిరోజు పనులుకోసం,మండల అధికారుల కార్యాలయాలు,ఆరోగ్య కేంద్రం,ప్రతి రోజు విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి,రైతులు తాము చేపట్టిన పంటల పలసాయం మార్కెట్టుకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ నిర్మాణ పనులు వేగవంతం చేయుటకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్న మండలం లోని కుటాలవంక, కడతట్లపల్లి,వెంగమవారి
పల్లి,కడపనత్తం, గౌనితిమ్మేపల్లిటి.ఎన్. కుప్పం,కుప్పనపల్లి,
పాతపేట గ్రామప్రజలు ప్రత్యుమ్నయ తాత్కాలిక
రహదారి లేకమండల కేంద్రం బైరెడ్డిపల్లి కి రాకపోకలు కోసం తీవ్ర
ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలు సమీపంలోని పొలాల్లో వెళ్లాలంటే రైతులు వేరుశెనగ పంట కోసం భూములు దుక్కిధున్ని పెట్టుకున్నారు.మరోవైపు గత రెండు రోజుల గా వర్షం కురిసిన కారణంగా పొలాల్లో వెళ్లాలంటే ఇబ్భంధులు ఎదుర్కొంటున్నారు. కావున 8 గ్రామాల ప్రజలు ప్రతిరోజు మండల కేంద్రంకు రాకపోకలు కోసం చర్యలు తీసుకోవాలని ఆగ్రామల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!