ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్స్టాపింగ్ ఉన్నా ఆగని పల్లె వెలుగు బస్సు

స్టాపింగ్ ఉన్నా ఆగని పల్లె వెలుగు బస్సు

📰 Generate e-Paper Clip

-ప్రయాణికుల ఆగ్రహం
-డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నాగలాపురం గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం టి.ఆర్. ఆర్ మండపం వద్ద అధికారిక బస్సు స్టాపింగ్ ఉన్నప్పటికీ మంగళవారం సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన పల్లె వెలుగు బస్సు అక్కడ ఆగకుండా వెళ్లిపోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
స్టాపింగ్ వద్ద ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సు నిలపకపోవడం ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శించారు. ఇటువంటి ఘటనల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సత్యవేడు డిపో ఉన్నత అధికారులు సంబంధిత డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, నిర్ణీత స్టాపింగ్‌ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!