బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్26
బైరెడ్డిపల్లి మండలం లోని బేలుపల్లి పంచాయితీ పట్నపల్లి లో నెలకొన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కి సోమవారం కనులపండువుగా పున్నమి గరుడసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మూలవర్లకు పంచామృత అభిషేకం, విశేషపూజలు కొనసాగింది. అర్చకులు సుస్వరం మురళి కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు బృందం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ,
భూదేవి, శ్రీదేవి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు,వివిధ ఆభరణాలు, పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులుచేసి అలయంచుట్టు పున్నమి గరుడసేవ ను నిర్వహించారు. ఈసందర్భంగా భక్తుల గోవిందనామాలతో అలయంచుట్టు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ దాతల సహకారంతో నిర్వహించారు.
