ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ శేషాద్రిస్వామి కీ పౌర్ణమి ప్రత్యేక పూజలు. తీర్థం లో కోలాహలంగా శ్రీ...

శ్రీ శేషాద్రిస్వామి కీ పౌర్ణమి ప్రత్యేక పూజలు. తీర్థం లో కోలాహలంగా శ్రీ వాల్మీకి జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్26

బైరెడ్డిపల్లి లో నెలకొన్న పురాతన శ్రీ శేషాద్రిస్వామి ఆలయంలో సోమవారం వైభవంగా పౌర్ణమి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు తిప్పచార్యులు చే పంచామృత అభిషేకం,విశేష పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయం ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయం వద్ద నెలకొనివున్న విద్యుత్ దీపాలంకరణ,
దేవతమూర్తులకు చేపట్టిన పుష్పఅలంకరణలు భక్తులకు కనువిందుచేస్తున్నాయి. భక్తులకు శేషాద్రిస్వామి సేవకుడు బైరెడ్డి ధనంజయ గౌడు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తీర్థంలో కోలాహలంగా
శ్రీ వాల్మీకి జయంతి వేడుకలు.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్26

బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో సోమవారం ఉదయం శ్రీ వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం,విశేష పూజలు నిర్వహించారు. రాత్రి శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటం రోతోత్సవంలో అధిరోహించి గ్రామ పురవీధుల్లో మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాల కోలాహలం మధ్య ఊరేగించారు. భక్తులు వాల్మీకి మహర్షి కిమంగల హారతులు పట్టారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షి సంఘం నాయకులు,వాల్మీకి సామాజిక వర్గం వారు, గ్రామస్థులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!