చౌడేపల్లి ఆగస్టు 06 గరుడ దాత్రి న్యూస్
ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక మృత్యుంజయ స్వామి దేవస్థానంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు జరిపారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.
ఈ కళ్యాణోత్సవంలో ఉభయదారులుగా బొగ్గారపు సుబ్రహ్మణ్యం, ఉషారాణి, అమరావతి
శ్రీనాథ్, రేవతి, కిషోర్, జీవనజ్యోతి, పోస్ట్ కృష్ణమూర్తి, ప్రవీణ్ రెడ్డి లతో పాటు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కళ్యాణానంతరం ఆలయ వర్గాలు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిపరవశంలో మునిగిపోయింది.
