ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం 20వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం

కుప్పం 20వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం

📰 Generate e-Paper Clip

కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 20వ వార్డులో గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ఆదేశాల మేరకు, 20వ వార్డులో క్లస్టర్ ఇంచార్జ్ సోమశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. “రెండు సంవత్సరాల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ క్లస్టర్-10, 20వ వార్డు పరిధిలోని బూత్ నెం. 166, 167, 168లలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జ్,20వ వార్డు కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్, 20వ వార్డు పార్టీ అధ్యక్షులు శ్రీధర్, బూత్ ఇన్చార్జ్లు లోకేష్, శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు హేమేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!