* కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పేరుతో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత భావోద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా సంస్కృతిని కాపాడామని, బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేశామని గుర్తుచేసుకున్నారు. అయితే స్వరాష్ట్రం వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ప్రజల కలలు సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైందని, గతంలో పాలించిన తన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో తాను సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఇసుక మాఫియా వంటి దారుణాలు జరిగాయని ఆమె అంగీకరించారు.
కేసీఆర్ ఒక మరబొమ్మ.. ఆయన మన మనిషి కాదు..
తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కవిత మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రస్తుతం “గుంటనక్కల చేతిలో చిక్కుకున్నారని”, ఆయన తన రాజకీయ పరిపక్వతను కోల్పోయారని విమర్శించారు. ఒకప్పుడు చేనేతల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రజల ఇళ్లు కూల్చేస్తుంటే బాధితులను ఆదుకోవడానికి బయటకు రావడం లేదని మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఒక ‘మరమనిషి’ (రోబ
