* 30వ తేదీ వరకు నారా భువనేశ్వరి పర్యటన.
* మహిళలతో ముఖాముఖి, పలు దేవాలయాల సందర్శన.
* ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ.
* పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ యంత్రాంగం.
* పర్యటన విజయవంతానికి పార్టీ ఇంచార్జ్ మునిరత్నం పిలుపు.
కుప్పం,జులై 26 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సోమవారం నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రధానంగా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో మహిళలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కుప్పం నియోజకవర్గంలోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటన కోసం నారా భువనేశ్వరి ఆదివారము రాత్రే కుప్పం నియోజకవర్గంలోని నివాసానికి చేరుకుంటున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు శాంతిపురం మండలంలోని నివాసం వద్ద ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించనున్నారు. అనంతరం రామకుప్పం మండలంలోని ననియాల ఎకో టూరిజం కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కావలి మడుగు లోని ఎకో టూరిజం సెంటర్ ను సందర్శిస్తారు. కావలి మడుగు ఎస్టీ కాలనీలో ఇంటింటా ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం పిఎంకె తాండా చేరుకుని మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత పంద్యాలమడుగు చేరుకొని మహిళలతో చర్చిస్తారు. రామకుప్పం చేరుకొని జడ్పీ హైస్కూల్లో డైనింగ్ హాల్ ప్రారంభిస్తారు. రాత్రి ఇంటికి చేరుకొని బస చేస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం కుప్పంలోని వంద పడకల ప్రాంతీయ వైద్యశాల చేరుకుంటారు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. అలాగే టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ద్రావిడ విశ్వవిద్యాలయం చేరుకొని అక్కడ విద్యార్థులతో క్విజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అగరం చేరుకొని మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. తరువాత యామిగాని పల్లెలో దేవాలయం వద్దకు చేరుకుంటారు. రాత్రి శాంతిపురం మండలంలోని స్వగృహం చేరుకొని బస చేస్తారు. 29వ తేదీ బుధవారం 9.30 గంటలకు ఇంటి వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అక్కడి నుంచి కుప్పం సమీపంలోని హార్టికల్చర్ హబ్ చేరుకుంటారు. వసనాడులో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు.వసనడు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. వాన గుట్టపల్లి బాబు నగర్ లో అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తారు. వేపూరులో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. గరిగశీనేపల్లిలో మహిళలతో మాట్లాడుతారు. జడ్పీ పాఠశాలలో చిల్డ్రన్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం స్వగృహం చేరుకుని రాత్రి బస చేస్తారు.30 వ తేదీ గురువారం ఉదయం సాయిబాబా టెంపుల్ చేరుకుంటారు. అనంతరం కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో అమ్మవారి సేవలో పాల్గొంటారు. తరువాత కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నాలుగు రోజుల పర్యటన విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం పిలుపునిచ్చారు.
కుప్పంలో నేటి నుంచి సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన
RELATED ARTICLES
