ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయండి

ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

రామకుప్పం జూలై 26 గరుడ దాత్రి న్యూస్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం రామకుప్పం మండలంలో పర్యటించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ ప్రధాన కార్యదర్శి కామరాజు నాయక్ లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి సోమవారం కుప్పం నుండి శాంతిపురం దండి కుప్పం మీదుగా కంచన బల్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ ఎం చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్ళిన అనంతరం నారాయణపురం తండాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అదేవిధంగా నానియాల గ్రామంలో మహిళల ముఖాముఖి కార్యక్రమం తర్వాత కావలి మడుగు పందాల మడుగు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మండల కేంద్రమైన రామకుప్పం బాలుర ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటశాల భవనాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!