ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో పెద్దపల్లి గంగమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి

కుప్పంలో పెద్దపల్లి గంగమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి

📰 Generate e-Paper Clip

* సీఎం సతీమణి నారా భువనేశ్వరి కి కొత్తపేట టిడిపి నేతలచే భారీ అఖండ స్వాగతం.
* మేళ తాళాలు మంగళ హారతులతో స్వాగతం పలికిన పార్టీ యంత్రాంగం.
* గంగమ్మ సేవలో పాల్గొన్న నారా భువనేశ్వరి.
* పండుగ వాతావరణం లో నారా భువనేశ్వరి కొత్తపేట పర్యటన.
* ఘనంగా స్వాగతం పలికిన ఆలయ పాలకవర్గం.
కుప్పం,జులై 30 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో పేరు గడించిన కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరి 4వరోజు గురువారం భువనేశ్వరి కుప్పంలోని ఆలయాలను సందర్శించారు. ఉదయం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు నారా భువనేశ్వరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి కి ఆలయం వద్ద ఆలయ పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికింది. సీఎం సతీమణి కొత్తపేటకు రావడంతో కొత్తపేటలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా కుప్పం కొత్తపేటలో పెద్దపల్లి గంగమ్మ ఆలయం వద్దకు నారా భువనేశ్వరి వస్తుండడంతో కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు యువకులు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో హారతులు పట్టి తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ 11వ క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్, కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పు ముఖేష్, ఆలయ పాలకవర్గం నారా భువనేశ్వరి కి ఘనంగా స్వాగతం పలికారు. కొత్తపేట లోని తెలుగుదేశం నాయకులు, యువకులు చంద్రబాబు జిందాబాద్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నారా భువనేశ్వరి కొత్తపేట పర్యటన విజయవంతంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి. ఎస్. మునిరత్నం,ఉడా చైర్మన్ సురేష్ బాబు, కుప్పం పురపాలక సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ డి. సుధీర్, టిడిపి నాయకులు తిరుమగళ్, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాయిబాబాను దర్శించుకున్న నారా భువనేశ్వరి: కుప్పం హెచ్. పి. రోడ్ లోని శ్రీ సాయిబాబాను సీఎం సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ డి. సుధీర్, సోమశేఖర్, రవి, దామోదరం నాయుడు, కే.ఎం. వేణుగోపాల్, శ్యాంసుందర్, కే.ఎన్. శ్రీధర్, బాలాజీ, నాగ స్వామి, పి. గోపీనాథ్, బిజెపి కుప్పం ఇంచార్జ్ తులసి నాథ్, పలువురు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!