బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29
బైరెడ్డిపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం విద్యార్థులు అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు
ఖో-ఖో (బాలికలు) వి.ప్రత్యుష, డి.తనుషఎం. శశికళ, వి.యశ్వంతి, ఎం.వనజ,కె హర్షిత,డి.వి.మిథున్,
ఖో-ఖో (బాలురు) జి.దిలిపీకుమార్,
వాలీబాల్: కె తెజేంద్ర
వాలీబాల్ విభాగంలో విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల వరకు ప్రత్యేక సాధన నిర్వహిస్తూ క్రమశిక్షణతో శిక్షణ అందించిన పాఠశాల పీడీ ఎస్. అల్తాఫ్ కృషి ఫలితంగా విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారని, పాఠశాలకు గర్వకారణం అయి నదని
ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
అదేవిధంగా ఖో-ఖో క్రీడాకారులకు ప్రతి ఆదివారం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ, ప్రస్తుతం ఇతర చోట సేవలందిస్తున్నప్పటికీ తాను గతంలో పనిచేసిన జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తున్న మాజీ పీడీ దేవేంద్ర సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు
సి. లక్ష్మీపతి విద్యార్థులను, శిక్షకులను అభినందిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పోటీలు జరిగిన ప్రాంగణానికి స్వయంగా హాజరై విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన పాఠశాల సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు శశి సహకారాన్ని కూడా అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, ఎస్‌ఎంసీ చైర్మన్ మోహన్, గ్రామ పెద్ద గోవిందస్వామి, సీఆర్‌పీ షేక్ షాబుద్దీన్, తీర్థం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు విద్యార్థులను, శిక్షకులను, ప్రధానోపాధ్యాయులను అభినందిస్తూ, జిల్లా స్థాయిలోనూ విజయాలు సాధించి పాఠశాల, గ్రామానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
