* శ్రీ కృష్ణార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు.
* ఇండియన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
* సంతాన గోపాలకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలు.
కుప్పం,సెప్టెంబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పట్టణంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంతాన గోపాలకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం అర్చన పూజలు నిర్వహించారు. వేద పండితులు సోమశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కుప్పం గుడిపల్లి మార్గంలోని శ్రీకృష్ణార్జున దేవాలయంలో అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, అర్చన ,ప్రత్యేక పూజలు, ప్రసాదం పంపిణీ చేపట్టారు. ప్రాకారోత్సవం నిర్వహించారు. దయానిధి దంపతులు పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. కుప్పం గుడిపల్లి మార్గంలోని ఇండియన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల శ్రీకృష్ణ వేషాధారణ ఆకట్టుకుంది. దయానిధి పిల్లలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
కుప్పంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
RELATED ARTICLES
