* 97.40 శాతం పూర్తి చేసిన యంత్రాంగం.
* కార్యక్రమం కొనసాగింపు తీరుపై చంద్రబాబు ఆరా.
* కార్యక్రమం కొనసాగిన తీరుపై చంద్రబాబుకు నివేదిక .
కుప్పం,సెప్టెంబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం విజయవంతంగా కొనసాగించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచనల మేరకు కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జూలై 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో కుప్పం అర్బన్ ,కుప్పం రూరల్, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 73,852 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. శాంతిపురం మండలంలో 15,275 ఇండ్లకు గాను 100శాతం ఇళ్లను పార్టీ యంత్రాంగం సందర్శించింది. గుడిపల్లి మండలంలో 11,590 ఇళ్లకు గాను 11,492 (99.15 శాతం)ఇళ్లను సందర్శించారు. రామకుప్పం మండలంలో 15,244 ఇళ్లకు గాను 15,060 (98.79 శాతం) ఇళ్లను సందర్శించారు. కుప్పం రూరల్ లో 18,939 ఇళ్లకు గాను 17,880 (94.41 శాతం) ఇళ్ళను సందర్శించారు. కుప్పం అర్బన్ పరిధిలో13,002 ఇళ్లకు గాను12,226 (94.03 శాతం) వీళ్లను టిడిపి యంత్రాంగం సందర్శించారు. ఇంకా కుప్పం అర్బన్ పరిధిలో 5.97 శాతం ఇళ్లను టిడిపి యంత్రాంగం సందర్శించాల్సి ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తీరుపై ప్రతినిత్యం మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో కార్యక్రమం కొనసాగిన తీరు, ప్రజల స్పందన, నాయకుల హాజరు, అందిన ప్రధాన సమస్యలు, ప్రజాభిప్రాయం తదితర అంశాలపై కుప్పం లోని పార్టీ కార్యాలయం సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. త్వరలో ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కార్యదర్శి అందించనున్నారు. అంతేకాకుండా మై టిడిపి యాప్ ద్వారా కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమం కొనసాగిన తీరుపై స్పష్టమైన నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది.
కుప్పం సెగ్మెంట్లో విజయవంతంగా ఇంటింటికి తెలుగుదేశం
RELATED ARTICLES
