ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో సీఎం చంద్రబాబుచే నేడు 289.5 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు-38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు

కుప్పంలో సీఎం చంద్రబాబుచే నేడు 289.5 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు-38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు

📰 Generate e-Paper Clip

* నేడు రేపు సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన.
కుప్పం, సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సోమవారం, రేపు మంగళవారం కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి చేరుకుంటారు. అక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. కుప్పం నియోజకవర్గంలో రైతు బజార్‌కు శంకుస్థాపన సహా కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.289.5 కోట్ల విలువైన పనులు ప్రారంభించుకోవడంతో పాటు,రూ.38.5 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. స్వర్ణ కుప్పం విజయాలను ప్రదర్శించే వీడియోను వీక్షిస్తారు. లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. “స్వర్ణ కుప్పం” అచీవ్‌మెంట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. హిందాల్కో ప్రతినిధులతో సమావేశమవుతారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. ఆరోజు రాత్రి దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు కుప్పం రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్‌ను ప్రారంభిస్తారు. కుప్పం పర్యటనలో రెండవరోజు మంగళవారం..ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన రూ.9,000 కోట్ల విలువైన హెచ్ ఏ ఎం పనులని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కేడర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!