ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాయలసీమ ప్రజల వరప్రసాదినిగా హంద్రీనీవా - వెలిగొండ ప్రాజెక్టులు

రాయలసీమ ప్రజల వరప్రసాదినిగా హంద్రీనీవా – వెలిగొండ ప్రాజెక్టులు

📰 Generate e-Paper Clip

* రాయలసీమను రతనాలసీమ చేస్తానన్న చంద్రబాబు -ఆ దిశలో కార్యాచరణ.
* కరువు నేలపై గల గల పారుతున్న కృష్ణమ్మ.
* 2025 ఆగస్టు 30న హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు కృష్ణ జలాలు.
* 2026 ఆగస్టు 31న వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు.
* నేడు మళ్ళీ కుప్పం గడ్డపై కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్న జననేత నారా చంద్రన్న.
* కుప్పం ప్రజల గుండెల్లో కొలువైన బాబన్న.
కుప్పం,సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): రాయలసీమ ప్రజల వర ప్రసాదినిగా హంద్రీనీవా- వెలిగొండ ప్రాజెక్టులు అలరారుతున్నాయి. రాయలసీమను రాళ్ళసీమ కానివ్వనని, రతనాల చేస్తానని తరచూ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించేవారు. తన వ్యాఖ్యలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించి ఆ దిశలో అడుగులు వేశారు. కృషి పట్టుదలతో పనులకు నిర్దేశిత లక్ష్యాలు నిర్ణయించి పనులు పూర్తీకి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కరువు నేలపై కృష్ణా జలాలు గలగల పారాయి. చుక్క నీటి కోసం ఆకాశం వైపు చూసే రాయలసీమ ప్రజల ఆశలు నెరవేరుస్తూ కృష్ణా జలాలు రాయలసీమ గడ్డపై పరుగులు పెట్టించారు. దీంతో రాయలసీమ ప్రజలు జైహో చంద్రన్న అంటూ నినదిస్తున్నారు. 2025 ఆగస్టు 30న కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం గడ్డకు తీసుకువచ్చారు.పరమ సముద్రం చెరువు వద్ద కనుల పండుగగా జల హారతి నిర్వహించారు. కుప్పం ప్రజల జె జె లనడుమ ఈ జల హారతి కార్యక్రమం కొనసాగింది. అలాగే 2026 ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను పరుగులు పెట్టించారు.కుప్పం గడ్డపై కృష్ణా జలాలు:
కుప్పం కు కృష్ణా జలాలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను జీవితాంతం గుండెల్లో ఉంచుకుంటామంటూ కుప్పం నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పేర్కొనడం విశేషం. శ్రీశైలం నుండి కుప్పంకు 738 కిలోమీటర్ల దూరం ఉండగా 1200 అడుగుల
ఎత్తులోని కుప్పంకు కృష్ణమ్మ జలాలను తీసుకువచ్చారు. ఇందుకోసం నిధుల సమస్య తలెత్తకుండా చూసుకున్నారు. 3,890 కోట్ల వ్యయంతో కృష్ణను జలాలను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇక కప్పం నియోజకవర్గం కృష్ణమ్మ జలాలతో పునీతమై కుప్పం నేల పాడిపంటలతో కలకలలాడుతూ కనిపించనుంది. చుక్కనీరు లేని చెరువుల్లో కృష్ణా జలాలను చూస్తూ పులకించిన ప్రజలు చంద్రబాబుకు జేజేలు పలుకుతున్నారు.హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి చేరాయి.ఇది దశాబ్దాల కల నిజమైనట్లు అయ్యింది.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది 30 వతేది ఆగస్టు లో కుప్పం మున్సిపల్ పరిధిలోని పరమసముద్రం చెరువు వద్ద కృష్ణమ్మకు నిరాహారతి నిర్వహించి దీనిని ప్రారంభించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 110 చెరువులను నింపుతూ 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించ లక్ష్యంతో ప్రభుత్వం దీనికి సంకల్పించింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రెండవ దశ ఆధునీకరణ, కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా జలాలు కుప్పం కు వచ్చి చేరింది.కృష్ణమజలాలతో 110 చెరువులు నింపడం,6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 8 మండలాల్లోని 4.02 లక్షల మందికి తాగునీటి సరఫరా కు అవకాశం లభించింది.131 కి.మీ. పొడవైన కుప్పం బ్రాంచ్ కెనాల్, 215 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు.రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలను అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.వెలిగొండ ప్రాజెక్టు:
వెలిగొండ ప్రాజెక్ట్ రాయలసీమ ప్రజల గుండెల్లో వెలుగులు నింపింది. తడారిన గొంతులకు, బీటలు వారిన భూములకు భారీ ఊరట లభించింది. వెలిగొండ వెలుగులు కరువు నేలపై కృష్ణమ్మ జలాలు గలగల పరుగులు పెట్టింది .వెలిగొండ ప్రాజెక్ట్ రాయలసీమ ప్రజల జీవనాడి అయ్యింది. రాయలసీమ ప్రజలు ఎదురుచూసిన సమయం రానే వచ్చింది.ఈ ఏడాది ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పండుగ వాతావరణం లో ప్రారంభించారు. 1996 మార్చి 5వ తేదీన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1999 మే నెల 8వ తేదీన మొదటి దశ పనులకు రూ.138 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయి. ఆ తర్వాత సాంకేతిక పరమైన ఇబ్బందులను అధిగమించడం సారంగాల తవ్వకం వంటి అంశాలపై అధ్యయనం కొనసాగింది. 2005-2014ఈ మధ్య కాలంలో ప్రాజెక్టుకు సంబంధించి రెండు సార్లు జీవోలు ఇచ్చారు. 2005లో ఓసారి. ఆ తర్వాత 2008లో మరోసారి జీవోలు ఇచ్చారు. కానీ పనులు పెద్దగా జరగలేదు. 2014-2019 టీడీపీ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. రూ.964.49 కోట్లు కేటాయించి రూ.1,385.81 కోట్లు ఖర్చు పెట్టారు. 18.8 కి.మీ మేర ఉన్న టన్నెల్ తవ్వకం పనుల్లో సుమారు 16 కి.మీ. పూర్తి చేశారు. 2019-2024 వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగాయి.రూ.4,003.51 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.981.66 కోట్లు ఖర్చు పెట్టారు. జూన్ 2024 తరువాత 2024లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కాలువ పటిష్టీకరణ, ఆర్ అండ్ ఆర్, టిబిఎం తొలగింపు వంటి కీలక పనులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుంది. పెండింగ్ బిల్లులు, టన్నెల్ పనులు, హెడ్ రెగ్యులేటర్లు, ఫీడర్ కాలువ, ఆర్ అండ్ ఆర్ పై సమాంతరంగా పనులు ప్రారంభించింది. 2026 ఫిబ్రవరి 24 ప్రాజెక్ట్ ఫేజ్-1 నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 2026-27 బడ్జెట్లో అవసరమైన నిధులను కేటాయించింది. 29 జూన్-22 ఆగస్టు 2026 మొత్తం మూడు విడతల్లో రూ.768 కోట్ల మేర ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు జరిపారు. 2026 జూన్ 29న 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడత ఆగస్టు 19వ తేదీన 1622 కుటుంబాలకు రూ. 200 కోట్లు, మూడో విడతగా ఆగస్టు 22వ తేదీన 2027 కుటుంబాలకు రూ.250 కోట్లు చెల్లించారు.వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం అంటే అదో కార్యక్రమం కాదు. నీటి కోసం ఎదురుచూసిన తరాల నిరీక్షణకు సమాధానం. బిందెడు నీటి కోసం తిరిగిన తల్లుల కష్టాలకు ఉపశమనం. నీటి కోసం ఎండిన డొక్కలతో ఎదురు చూసే రైతుల్లో కలిగిన నమ్మకం, వలసలు బాధలు తప్పుతున్నాయనే ఊరట. కరువు నేలపై కృష్ణమ్మ అడుగుపెడితే రైతు ఇంటికి ఆదాయం. గ్రామానికి జీవం. యువతకు ఉపాధి. కుటుంబానికి భరోసా. ఇప్పటివరకు వర్షం కోసం ఆకాశం వైపు చూసిన ప్రజలు, రైతు లు ఇక ఏ వంట వేయాలా అని ఆలోచించనున్నాడు. ఏ ఊరు వలస వెళ్లాలా అని నగరాల వైపు చూసిన కుటుంబాలు. సొంత ఊరిలోనే ఉపాధి వెతుక్కోనున్నాయి. ఒకప్పుడు పొట్ట చేత పట్టుకున్న కుటుంబాలు. ఇక పంట చేత పట్టుకోనున్నాయి. ఇక ఈ నేల నుంచి వలసలు ఆగనున్నాయి. పంటలు, ఉత్పత్తులు, మార్కెట్లకు వెళ్లనున్నాయి.ఇది ప్రాజెక్టు కాదు. ఒక ప్రాంతం పునర్జన్మ. ఏళ్ల తరబడి కరువును చూసిన మార్కాపురం నేలకు వెలిగొండ ఒక కొత్త అధ్యాయం. నీళ్లు ఎక్కడ? అనే ప్రశ్న కాదు.ఏ పంట వేయాలి? అనే ప్రశ్న . పని కోసం ఎక్కడికి వెళ్లాలి? అనే మాట కాదు. మన ఊరిలోనే ఏ పని చేసుకోవాలి? అనే మాట. వాన కోసం ఎదురుచూపు మాత్రమే కాదు. పంటపై భరోసా ఉండాలి.నీటి కోసం ఎదురుచూసిన ఈ నేల. ఇకపై నీటితో తన బతుకును తానే మార్చుకున్న ప్రాంతంగా గుర్తింపు పొందాలి. విజయాల మోత మోగాలి. వెలిగొండ ఒక సాగునీటి మాత్రమే ప్రాజెక్టు కాదు. రాయలసీమ ప్రజల జీవనాధారం అయింది
వెలిగొండ ప్రాజెక్టు వివరాలు: ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ-కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది.వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం ఫోర్ ర్ కొల్లం వాగు ఎగువ భాగం నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తరలిస్తారు. మొత్తంగా 53.85 టీఎంసీల నీటిని వెలిగొండ ప్రాజెక్టులో నిల్వ చేసుకోవచ్చు.మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.10,200 కోట్లు, మొదటి విడత పూర్తయ్యే నాటికి మొత్తంగా రూ.7983 కోట్ల విలువైన పనులు జరిగాయి.
ఇందులో 2014-19, 2024-26 మధ్య కాలంలో దాదాపు సగం పనులను టీడీపీ, కూటమి ప్రభుత్వాలే చేశాయి. 2019-24 మధ్య కాలంలో రూ.981 కోట్ల పనులను చేపడితే,
వాటిల్లో రూ.140 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారు. అంటే వైసీపీ హయాంలో కేవలం రూ.841 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 2.77 శాతం పనులను మాత్రమే జరిగాయి. ఇక మిగిలిన పనులను ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టారు. 2014-19, 2024 తర్వాత అధికారం చేపట్టిన తర్వాత 18.8 కిలో మీటర్ల మేర పొడవున జంట సొరంగాలు వేగంగా తవ్వారు. 21.8 కిలోమీటర్ల మేర ఫీడర్ కాలువల పనులు చేపట్టారు.జలాశయ నిర్మాణం కోసం సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాప్ల వద్ద మూడు కాంక్రీట్ చీభీ డ్యామ్లు నిర్మించారు. ప్రధాన కాలువలుగా తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువలు ఉన్నాయి.మొత్తంగా 4,47,300 ఎకరాల ఆయకట్టుకు లబి చేకూరుతుంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాల ప్రజల దశ-దిశను ఈ ప్రాజెక్టు మార్చనుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3,36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లా పరిధిలో 84,000 ఎకరాలు, కడప జిల్లాలో 27,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. తీగలేదు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3,70,800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 30. మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 23 లక్షల మందికి తాగునీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా 10.70 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు కృష్ణా జలాలను రిలీజ్ చేస్తున్నారు. తొలి విడతగా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు-4 లక్షల మందికి తాగునీరు, రెండో విడతగా 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు-11.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.మొత్తం 35,032 ఎకరాల భూమి అవసరంలో 30,300 ఎకరాలు సేకరణ పూర్తి. 11 ముంపు గ్రామాలకు చెందిన 7,321 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు గుర్తింపు. మార్కాపురం కరువు అంతం రాష్ట్రంలో అత్యంత కరువు ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఉంది. పశ్చిమ ప్రకాశంలో సగటు వర్షపాతం 650 మి.మీ. దాటని పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోవడం, పంట నష్టాలు, కనిగిరి, కంభం, పొదిలి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వీటిని అధిగమించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుంచి పూర్తి గ్రావిటీతో 43.50 టీఎంసీల కృష్ణా జలాలను జంట సారంగాల ద్వారా తరలించేలా వెలిగొండ ప్రాజెక్టును డిజైన్ చేశారు. నదీగర్భంలో కాకుండా గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చి నింపే అతి పెద్ద ప్రాజెక్టుల్లో వెలిగొండ ఒకటి. నల్లమలసాగర్లో నిల్వ చేసి, 3 ప్రధాన కాల్వల ద్వారా సాగు తాగునీటి అవసరాలకు వెలిగొండ ప్రయోజనాలు:
దశాబ్దాల కలను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారు. వెలిగొండను కేవలం వ్యవసాయానికి ఉపయోగపదే ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాకుండా, స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రజారోగ్య ప్రాజెక్టుగా చూడాలి. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశంలో భాగమైన మార్కాపురం ప్రాంతం సహా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం కలుగుతుంది.
పంటలకు అవసరమైన నీటి కోసం దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది. ఈ ప్రాజెక్టుతో నీటి భద్రత ఆర్థిక భవిష్యత్తు కలగనుంది. సాగునీటి లభ్యతతో పంటలపై అనిశ్చితి తగ్గుతుంది. వైవిధ్య పంటలు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దిగుబడి మెరుగవుతుంది. తద్వారా రైతు ఆదాయం పెరుగుతుంది.
భూగర్భజలాల పునరుద్దరణకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో బోర్లపై ఆధారపడటం తగ్గుతుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ ఉపాధి, మార్కెటింగ్, ప్రాసెసింగ్, సేవారంగం విస్తరిస్తాయి. వలసలకు అడ్డుకట్ట ఏపీఐఐసి,
దొనకొండ, వంటి పారిశ్రామిక అవసరాలకు నీరు లభిస్తుంది. దీంతో అభివృద్ధికి బాటలు పడతాయి. వలసలు తగ్గి, గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం ఏర్పడుతుంది. వెలిగొండ నీరు అందుబాటులోకి వస్తే వ్యవసాయంతో పాటు హార్టికల్చర్, అగ్రో-ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు అవకాశం పెరిగింది.వెలిగొండతో పాటు హార్టికల్చర్, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను రామాయపట్నం పోర్టుతో అనుసంధానం చేయవచ్చు. వెలిగొండ నీరు వస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఉద్యాన పంటలు వృద్ధి చెందుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.నల్లమల కొండల శ్రేణిలో మధ్యలో ఉన్న సహజ లోయ ప్రాంతాన్ని వినియోగించుకుని నల్లమలసాగర్ రిజర్వాయర్ను నిర్మించారు. సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల సమీపంలో కొండల మధ్య గోడలాంటి ఆనకట్టలు నిర్మించి, సుమారు 20 కిలోమీటర్ల పొడవైన సహజ రిజర్వాయర్సు రూపొందించడం వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేకత. కొండలే సహజ సరిహద్దులుగా ఉండటంతో, భారీ మొత్తంలో నీటిని నిల్వ చేసేందుకు కృత్రిమ నిర్మాణాలు తక్కువగా అవసరమయ్యాయి. ఇది ప్రాజెక్టు డిజైన్లో ఒక తెలివైన ఇంజినీరింగ్ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. శ్రీశైలం జలాశయం ఎగువ ప్రాంతంలోని కొల్లం వాగు సమీపంనుంచి కృష్ణా నది వరద జలాలను తొలుత మళ్లిస్తారు. అక్కడి నుంచి ఈ జలాలు జంట సారంగాల గుండా ప్రయాణించి, భూఉపరితల మార్గంలో సుమారు 21.6 కిలోమీటర్లు ప్రయాణింది. నల్లమలసాగర్లో నిల్వ అవుతాయి. ఇందుకోసం కొల్లంవాగు వద్ద అప్రోచ్ చానల్, హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం కీలకమైనవి. ఈ చానల్ నిర్మాణంలో వచ్చిన జాప్యాలు మొత్తం ప్రాజెక్టు గడువుపై ప్రభావం చూపాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ పనులు వేగంగా పూర్తయ్యాయి. కొల్లంవాగు అప్రోచ్ చానల్, హెడ్ రెగ్యులేటర్ గేట్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మార్కాపురం జిల్లా, మార్కాపురంలో ఉన్న ఒక నీటిపారుదల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు, కొల్లవావాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ తీరం నుండి కృష్ణా నది నుండి 43.5 టీఎంసీల వరద నీటిని మళ్లించి, నల్లమలసాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయడం ద్వారా, మార్కాపురం, నెల్లూరు మరియు కడప
జిల్లాల్లోని ఫ్లోరైడ్ మరియు కరువు ప్రభావిత ప్రాంతాలలోని 30 మండలాల్లో 4,47,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యాలను మరియు 15 లక్షల మందికి తాగునీటిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నీటిని నల్లమల కొండల మీదుగా 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాల ద్వారా తీసుకుంటారు. ఈ ప్రాజెక్ట్కు “పూల సుబ్బయ్య నీటిపారుదల ప్రాజెక్ట్” అని పేరు మార్చారు.
నేడు మళ్లీ కృష్ణా జలాలకు జలహారతి: శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరో విడత కృష్ణాజిల్లాలు పరుగులు పెడుతూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకోగానే శాంతిపురం మండలంలో కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను భారీ ఎత్తున చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక పరంగాను కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారు. కృష్ణా జలాలను కుప్పం నేలపై పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!