* విద్యార్థుల్లో సృజనాత్మకత, పెంపొందించేందుకు దోహదం కేఈసి వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్.
కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో సి ఈ సి విభాగం మరియు ఐ ఈ ఈ ఈ స్టూడెంట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక, సాంస్కృతిక వేడుకలు ఘనంగా ముగిశాయి. వివిధ కళాశాలల నుంచి 450 మందికి పైగా విద్యార్థులు పాల్గొని సాంకేతిక, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.రెండవ రోజు నిర్వహించిన వివిధ పోటీలు, కార్యక్రమాల్లో విజేతలకు రూ.60,000 వరకు విలువైన బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల వైస్ చైర్మన్ డా. సునీల్ రాజ్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ఘనంగా అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, పోటీ స్ఫూర్తి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సి ఈ సి నిర్వాహకులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
