ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరైల్వేకోడూరులో 28న జాబ్ మేళా

రైల్వేకోడూరులో 28న జాబ్ మేళా

📰 Generate e-Paper Clip

12 ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు.. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత

తిరుపతి, సెప్టెంబర్ 24 గరుడధాత్రి న్యూస్ :
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 28న రైల్వేకోడూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేకోడూరు సాయి నగర్‌లోని శ్రీ సాయి డిగ్రీ, పీజీ కళాశాలలో ఉదయం 8.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జాబ్ మేళా పోస్టర్‌ను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గురువారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో 12 ప్రముఖ బహుళజాతి సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు.

ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా Naipunyam Portalలో నమోదు చేసుకుని, Build Your Resume ద్వారా తమ ప్రొఫైల్‌ను పూర్తి చేసి సంబంధిత కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

రిజిస్ట్రేషన్:

మరిన్ని వివరాల కోసం 9052717078, 9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎల్‌డీఎం జి. రవికుమార్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం, ఎన్‌టీఓ సునేష్ బాబు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సులేమాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!