ePaper
Monday, August 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం టిడిపి పదకొండో క్లస్టర్లో విజయవంతంగా పూర్తయిన డోర్ టు డోర్ ప్రచారం

కుప్పం టిడిపి పదకొండో క్లస్టర్లో విజయవంతంగా పూర్తయిన డోర్ టు డోర్ ప్రచారం

📰 Generate e-Paper Clip

* క్లస్టర్ ఇంచార్జ్ కే.కన్నన్ ఆధ్వర్యంలో టిడిపి యంత్రాంగం తోడుగా కార్యక్రమం పూర్తి.
* 7 వార్డులు,12 బూత్ ల పరిధిలో 4,101 ఇండ్లను సందర్శించిన టిడిపి యంత్రాంగం.
* ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటా వివరణ.
* సమస్యలు తెలుసుకుని జననాయకుడి ద్వారా ప్రభుత్వానికి నివేదించిన కే. కన్నన్.
* నిత్యం ప్రజలతో ఉండేందుకు దోహదం చేసిన కార్యక్రమం. క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్.
కుప్పం,ఆగస్టు 23 (గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ 11 క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టింది. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జూలై 27వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంను ప్రతినిత్యం మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తూ పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా గత నెల 27న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కుప్పం 11వ క్లస్టర్ ఇంచార్జ్ కె. కన్నన్ ఆధ్వర్యంలో పార్టీ మార్గదర్శకాల ప్రకారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 27న ప్రారంభించారు. శుక్రవారంతో క్లస్టర్ పరిధిలో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్ ఆధ్వర్యంలో పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 11వ క్లస్టర్ పరిధిలో ఏడు వార్డులు 12 బూత్ లు ఉండగా 4,101 ఇండ్లు ఉన్నాయి. మొత్తం ఇండ్లను శుక్రవారం వరకు ఇంటింటా కార్యక్రమం ద్వారా సందర్శించారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా వివరించారు. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజలతో మమేకమై సమస్యలను సైతం తెలుసుకున్నారు. ప్రజల ద్వారా తెలుసుకున్న సమస్యలను పార్టీ కార్యాలయంలోని జననాయకుడు వేదిక ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద 11వ క్లస్టర్ పరిధిలో క్లస్టర్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమిష్టి సహకారంతో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్ తో పాటు, కో క్లస్టర్ తిరుమగల్, అర్బన్ సెక్రెటరీ నభిఉల్లా,యూనిట్ ఇన్చార్జీలు ముఖేష్,సురేష్,బాబు, సుబ్రమణి కో యూనిట్లు వేలు, రవి, వరదరాజులు, పార్టీ ప్రెసిడెంట్లు సాయికుమార్, ఇర్ఫాన్, పాండవ కుమార్, మురళి, లోకేష్, బూత్ ఇన్చార్జీలు గనివుల్లా, ఉమా శంకర్, ఎల్లప్ప, ప్రతాప్, ప్రకాష్, స్వామి, మోహన్, మణి, ఉదయ్ కుమార్, సురేష్, కృష్ణ, ఉమర్ ఫారూఖ్, చిట్టిబాబు, దిలీప్, మదన్, రఫీ,రియాజ్, హరీష్, ప్రభాకర్, అరుల్, అంజాద్, ఫరూక్, నవీన్, ధర్మ, మాజీ ఎంపిటిసి కృష్ణన్, మాజీ సర్పంచ్ మణి, నియోజకవర్గ ఎస్టీ అధ్యక్షులు నాగభూషణం, ఎక్స్ సర్పంచ్ సోమశేఖర్ లు ఇంటింటా టిడిపిలో పాల్గొన్నారు.
ఇంటింటా టిడిపికి ప్రజల నుంచి అపూర్వ స్పందన:11వ క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 27వ తేదీ నుంచి ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించామని 11వ క్లస్టర్ ఇంచార్జ్ కే .కన్నన్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించామని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నాం అన్నారు. కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలోని పోగురుపల్లె వద్ద 32 పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని ప్రజలకు వివరించామన్నారు. అంతే కాకుండా వేలాదిమందికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తుందని ప్రజలకు తెలిపామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు తెలిపామన్నారు. తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి క్లస్టర్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు. పార్టీ యంత్రాంగానికి, అధిష్టాన వర్గం కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!