– కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు.
కుప్పం, జులై 02 (గరుడ ధాత్రి న్యూస్):
శాంతిపురం మండల పరిధిలోని కెనమాకులపల్లి పంచాయతీ కేంద్రంలో వికసితభారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ను ప్రారంభించారు. గురువారం ఈ కార్యక్రమాన్ని మాజీ శాసన మండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు, స్థానిక నాయకులు, గ్రామీణులు కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజులు పాటు హామీ కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కెనమాకులపల్లిలో వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ప్రారంభం
RELATED ARTICLES
