ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికొటార్వేడు దళితవాడలో 450 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం

కొటార్వేడు దళితవాడలో 450 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం, జూన్ 7 (గరుడాద్రి న్యూస్):

కార్వేటినగరం మండలం కొటార్వేడు దళితవాడలో అక్రమంగా నాటు సారా తయారీ జరుగుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించారు.
అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నాటు సారా ఊటను పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి, నాటు సారా తయారీ మరియు విక్రయాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు.
ఎవరైనా అక్రమంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్సై తేజస్విని హెచ్చరించారు.
ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!