ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గడ్డంవారిపల్లిలో 'మేరా రేషమ్ – మేరా అభియాన్' సదస్సు

గడ్డంవారిపల్లిలో ‘మేరా రేషమ్ – మేరా అభియాన్’ సదస్సు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లి గ్రామంలో “మేరా రేషమ్ – మేరా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డిఎస్‌ఓ రాధా మేడమ్, సీఎస్‌బీ సైంటిస్ట్ అలేఖ్య మేడమ్, ఏఎస్ఓ అరుణ మేడమ్ మరియు టీఏ వనజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిఎస్‌ఓ రాధా మేడమ్ రైతుల మల్బరీ తోటలను, పట్టుపురుగుల పెంపకం షెడ్లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికై ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, సబ్సిడీల వివరాలను రైతులకు సమగ్రంగా వివరించారు. మల్బరీ తోటల రక్షణ కోసం తోటల చుట్టూ నేపియర్ గడ్డి సాగు చేయాలని రైతులకు సూచించడంతో పాటు, దిగుబడి పెంపునకు అవసరమైన పలు సాంకేతిక సలహాలు అందించారు.
అనంతరం సీఎస్‌బీ సైంటిస్ట్ అలేఖ్య మేడమ్ మాట్లాడుతూ, మల్బరీ తోటలు మరియు పట్టుపురుగులను ఆశించే వివిధ రకాల తెగుళ్లు, వ్యాధులు గురించి రైతులకు అవగాహన కల్పించారు. స్థానిక రైతు శ్రీ సుబ్రహ్మణ్యం గారి మల్బరీ తోటలో వేరు కుళ్లు వ్యాధి నివారణపై ప్రత్యక్ష క్షేత్ర ప్రదర్శన నిర్వహించి, వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యలను ప్రాక్టికల్‌గా చూపించారు.
ఈ కార్యక్రమంలో చౌడేపల్లి, సోమల, మరియు సదుం మండలాలకు చెందిన విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లు స్థానిక పట్టు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!