ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఘనంగా 'అంగన్‌వాడీ ఉత్సవం'

ఘనంగా ‘అంగన్‌వాడీ ఉత్సవం’

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్

స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ‘అంగన్‌వాడీ ఉత్సవం’ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణులు, బాలింతలు మరియు పిల్లలకు అందిస్తున్న సేవలు, పోషకాహార పంపిణీ వివరాలను అంగన్‌వాడీ సిబ్బంది వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1, 3వ శుక్రవారాల్లో ఇంటికి రేషన్ కింద 3 కేజీల బియ్యం, 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1 కేజీ కందిపప్పు, 0.5 కేజీ నూనె, కలపాలు, 25 గుడ్లు, 250 గ్రాముల ఖర్జూరం, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశెనగ చిక్కీ రెండు దఫాలుగా అందిస్తున్నామన్నారు 7 నెలల – 3 ఏళ్ల పిల్లలకు ప్రతి నెల 2.5 కేజీల బాలామృతం, 25 గుడ్లు, 2.5 లీటర్ల పాలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు
3 – 6 ఏళ్ల పిల్లలకు ప్రీ-స్కూల్ కిట్ ద్వారా ఆటపాటలతో బోధన అందిస్తూ, ప్రతిరోజూ తాజా వేడి భోజనం (75 గ్రా బియ్యం, 15 గ్రా కందిపప్పు, 30 గ్రా కూరగాయలు, 5 గ్రా నూనె), ఉడకబెట్టిన గుడ్డు మరియు 100 మి.లీ. పాలు అందిస్తున్నమ్మన్నారు ప్రతి నెల 1, 3వ బుధవారాల్లో సీమంతం, అన్నప్రాశన, పోషణ వేడుకలు, ప్రీ-స్కూల్ సంసిద్ధత వంటి సామాజిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు
మౌలిక వసతులు ఆరోగ్య పర్యవేక్షణ
ప్రభుత్వ వసతులు అంగన్‌వాడీ కేంద్రానికి ప్రభుత్వం ద్వారా గ్యాస్ కనెక్షన్, ఇండక్షన్ స్టవ్, స్టీల్ గిన్నెలు, పిల్లల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసులు మంజూరయ్యాయి.
ప్రతి నెల 2వ శుక్రవారం ‘శిశు దినోత్సవం’ నిర్వహించి పిల్లల బరువు, ఎత్తు కొలుస్తారు. ‘నవచేతన యాప్’ ద్వారా పిల్లలకు స్క్రీనింగ్ చేసి, లోపాలు ఉన్న పిల్లలను ఆస్పత్రికి రిఫర్ చేసి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా మొదటిసారి గర్భం దాల్చిన వారికి ₹5,000/-, రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే ₹6,000/- ఆర్థిక సాయం అందుతోందని, ప్రస్తుతం ఈ కేంద్రంలో 7 గురు గర్భిణులు, 3 గురు బాలింతలు ఈ లబ్ధిని పొందారని వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా, గర్భిణులు, బాలింతలు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!