ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికే యం పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేసిన ఉప విద్యాశాఖ అధికారి

కే యం పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేసిన ఉప విద్యాశాఖ అధికారి

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 28 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం కేఎం పురం పంచాయతీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి మహేశ్వరరావు సోమవారం తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో జరుగుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి 10వ తరగతి విద్యార్థులకు సూచనలు సలహాలు అందించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాలలో గత సంవత్సరంలో 580 మార్కులు సాధించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సునీత మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!