ePaper
Monday, October 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఘనంగా ప్రారంభమైన శ్రీరామచంద్రస్వామి దసరా బ్రహ్మోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన శ్రీరామచంద్రస్వామి దసరా బ్రహ్మోత్సవాలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 11 గరుడదాత్రి :

బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో దసరా బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉదయం ధ్వజారోహణం, కలశస్థాపన, మండపోత్సవ కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నారాయణరావు కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.
అనంతరం సీతా, లక్ష్మణ, హనుమంత సమేత శ్రీరామచంద్రస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి మండపోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గోవిందుగౌడు కుటుంబ సభ్యులు ఉభయదారులుగా పాల్గొనగా, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!