అన్నదాన కార్యక్రమంతో సంబరాలు..
మొగసాల బ్రదర్స్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన వేడుకలు
బైరెడ్డిపల్లి, గరుడదాత్రి, అక్టోబర్ 11 :
బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. మొగసాల బ్రదర్స్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మొగసాల కృష్ణమూర్తి, మొగసాల రెడ్డప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దయానంద్ గౌడ్, చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మొగసాల రాజా, బైరెడ్డిపల్లి మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైసీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
