ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా శ్రీ కృష్ణాష్టమి సంబరాలు

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి సంబరాలు

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) :
శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని స్థానిక టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి కార్యాలయంలో శ్రీ కృష్ణాష్టమి సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని ప్రతిమను అందమైన పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులకు, కార్యకర్తలకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో శివాలయం చైర్మన్ మురళీకృష్ణ, రిటైర్డ్ తహసీల్దార్ అమరేంద్ర బాబు, టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్‌లు సురేష్, సుధాకర్, వార్డు అధ్యక్షులు డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, నరేష్, గిరిధర్, గణేష్, షణ్ముగం, యువరాజ్, భాస్కర్, విజయ్ శేఖర్, జగ్గా, శ్రీనివాసులు, నాగేంద్ర, లోకమూర్తి, మురళీ, కేశవ శివాలయం డైరెక్టర్లు రెడ్డప్ప, బాబు, వీరప్ప, మోహనప్రియలతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకలను జయప్రదం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!