ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చెట్లు నాటడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలి

చెట్లు నాటడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

వసనాడులో గంగమ్మ ఆలయాన్ని సందర్శించి భువనేశ్వరి పూజలు
వసనాడు జడ్పీ స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన భువనేశ్వరి

కుప్పం,జూలై 29(గరుడ ధాత్రి న్యూస్):చెట్లు నాటడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి,ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం వసనాడు గ్రామంలో జడ్పీ పాఠశాలలో మొక్కలు నాటి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఇవాళ నాటిన చెట్టు రేపు వృక్షమై పదిమందికి నీడనిస్తుందన్నారు.గురువులను గౌరవించాలని,వారిని హేళన చేయకూడదన్నారు.తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారనే విషయాన్ని పిల్లలు మర్చిపోకూడదన్నారు.
నా జీవితంలో స్పూర్తినిచ్చిన వ్యక్తులు నా తల్లి,నా భర్త అన్నారు.మా నాన్న సినిమా షూటింగులతో బిజీగా ఉండటంతో మా అమ్మే మా బాధ్యత చూసుకునేవారు.
చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే హెరిటేజ్ బాధ్యతలు తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. చదువుకునే రోజుల్లో నాకు ఇంగ్లీష్ , సోషల్ ఇష్టమైన సబ్జెక్టులు. జీవితంలో సాయం చేసిన వారిని విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోకూడదు.
ఏఐని అవసరం మేర ఉపయోగించుకోవాలి.
ఈ పాఠశాలకు కావాల్సిన టాయిలెట్ సౌకర్యం, ఆర్ వో ప్లాంట్, మరికొంత స్థలం సహా పలు సౌకర్యాలకు నా వంతు సాయం అందిస్తానన్నారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!