ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చౌడేపల్లిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

చౌడేపల్లిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 22 గరుడ దాత్రి న్యూస్

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని చౌడేపల్లి మండల కేంద్రంలో అభిమానులు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
​ఈ సందర్భంగా స్థానిక శ్రీ అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో చిరంజీవి పేరిట అర్చకులు విశేష పూజలు, ప్రత్యేక అర్చనలు జరిపించారు. చిరంజీవి సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ స్వామివార్లకు ప్రార్థనలు చేశారు.
​అనంతరం చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మోనా ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్న అంతర్రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. సమాజసేవే పరమావధిగా తమ అభిమాన కథానాయకుడి పుట్టినరోజున ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వైద్యాధికారి పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మురళి, లీలా కుమార్, జావిద్, నరేష్, కాలేశా, సైపుల్ల తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!