ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకంబ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

కాణిపాకంబ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ప్రతి భక్తుడు సంతృప్తిగా భగవంతుడి దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలి

100 సీసీ కెమెరాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాము

అగమ శాస్త్రాల ప్రకారమే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంజరుగుతుంది

కాణిపాక బ్రహ్మోత్సవాల సమయంలో మెడికల్ ఆధ్వర్యంలో నిరంతరం వైద్య సిబ్బంది, అంబులెన్స్, అందుబాటులో ఉండాలి

కాణిపాక బ్రహ్మోత్సవాల సమయంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నాము

—కలెక్టర్ సుమిత్ కుమార్
—ఎమ్మెల్యే మురళీమోహన్
–జిల్లా ఎస్పీ తుషార్ డు డి

కాణిపాకం, ఆగస్టు 22(గరుడదాత్రిన్యూస్):వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కాణిపాకంబ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారంకాణిపాకం ఆలయఈఓకార్యాలయంలోని సమావేశ మందిరంలో కాణిపాకవరసిద్దివినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో
స్థానిక ఎమ్మెల్యే మురళి మోహన్,SP
,ఈ ఓ పెంచల కిషోర్, ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
సెప్టెంబరు 14 నుండి అక్టోబర్ 10 వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్స వాలు నిర్వహించడం జరుగుతుందని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు ఎక్కడ ఎలాంటి పొరబాట్లు జరగకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించేవిధంగాఅధికారులు కృషి చేయాలని తెలిపారు,
కాణిపాక ఆలయగేటు వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టాలి, విద్యుత్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఫైర్ అధికారులు 24/7విధులునిర్వహించవలె అని తెలిపారు,రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు ఎక్కడ ఎలాంటి పొరబాట్లు జరగకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలనితెలిపారు,ఆర్డీవో, డి.ఎస్.పి, ఆలయ ఈవో ఆధ్వర్యంలోకంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు, పది కాలాలపాటు భక్తుల గుండెల్లో నిలిచిపోయేలా బ్రహ్మోత్సవాలను నిర్వహించు కోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఈఓ అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ద్వారా ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆలయ ఈవో, విద్యుత్ అధికారులు, ఫైర్ ఆఫీస్ అధికారులు సమగ్రంగాఆలయం వెలుపల, ఆలయంలోపల విద్యుత్ సౌకర్యం ఎలా ఉన్నది,పరిశీలించిసిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు, వాహనం తిరిగే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణ కలిగి ఉండాలని ఆదేశించారు. చిత్తూరు ఆర్డిఓ ఆధ్వర్యంలో ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రోటోకాల్లో ఎమ్మార్వోలను, డిప్యూటీఎమ్మార్వోలనువిధులు నిర్వహించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయుచు న్నామని తెలిపారు చిత్తూరు ఆర్డీవో పర్యవేక్షణలోపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవాలల్లో ఎలాంటిపొరబాట్లు జరగ కుండా జాగ్రత్తగా మీ విధులు నిర్వర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ఉత్సవాలు సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అంబులెన్సులు, నైపుణ్యం కలిగిన డాక్టర్లను నియమిం చాలని డి ఎం హెచ్ ఓ ఆదేశించారు. డిపిఓ ఆధ్వర్యంలో కాణిపాక ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని డిపిఓను ఆదేశించారు. కాణిపాక నగరంలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు యాలని, భక్తులకు సురక్షితమైన తాగునీరు అందజేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో నడపాలని ఆదేశించారు, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం ఉండే విధంగా
జిల్లా పంచాయతీ అధికారి, గ్రామపంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సందర్భంగా డ్రోన్ కెమెరాలు, మ్యాన్ ప్యాక్ లు ఏర్పాటు చేసుకుని ఆలయ పరిసర ప్రాంతాలలో గట్టి భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూ లైన్స్ నందు వేచి ఉండే భక్తులకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అత్యవసర చికిత్స అందించుటకు అంబులెన్స్లు, వీల్ చేర్స్ అందుబాటులో ఉండాలి. నిరంతరం విద్యుత్ సరఫరా కొరకు అవసరమైన ఎడల కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగు ప్రదేశములను ఆలయ పరిసర ప్రాంతాలలో ముందుగా గుర్తించి తగు జాగ్రత్త తీసుకోవాలి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆనవాయితీగా నిర్వహించుచున్న వివిధ వాహన సేవలో స మయములందు ఉభయ దారుల సంప్రదాయాన్ని అనుసరించి రాత్రి 7 గంటల నుంచి వాహన సేవలు ప్రారంభించి రాత్రి 12 గంటల లోపల తిరిగి ఆలయానికి చేరే విధంగా వాహనాలు తిరగాలని పేర్కొన్నారు. త్వరలో 100 సీసీ కెమెరాలను కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
కాణిపాకం నుండి ప్రతి పది నిమిషాలకు, చిత్తూరుకు ఆర్టీసీ బస్సులు నడపాలి అని తెలిపారు.
జిల్లా ఎస్పీ తుషార్ డు డి మాట్లాడుతూకాణిపాక బ్రహ్మోత్సవాల సమయంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నాము తెలిపారు. దేవాలయ ప్రాంగణము, సు పద మండపం, కోనేరు, బస్టాండు, కళ్యాణ కట్ట, ఆలయ పరిసర ప్రాంతాలలో ముఖ్య ప్రదేశాలలో రథోత్సవము, పుష్ప పల్లకి ఉత్సవములు సందర్భంగా తగినంత పోలీసు భద్రత సిబ్బంది నియమించడం జరుగుతుందని తెలిపారు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకుని24 గంటలకు పోలీసులు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మ మ ణినాయుడు, ఆలయ కమిటీ మెంబర్లు,ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా ఫైర్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ సూపర్డెంట్ ఇంజనీర్, ఎస్పీడీఎస్ఎల్, డిఎం హెచ్ఓ, డిపిఓ. ఆర్టీవో. DPO,RTO, ఆర్టిసి డిపో మేనేజర్, పిఆర్, ఆర్& బి ఇంజనీర్లు, సంబంధిత డీఎస్పీలు, జిల్లా లోని ఈ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!