ఓటర్లు నిర్భయంగా ఓటును సద్వినియోగం చేసుకోవచ్చు
కుప్పం, పలమనేర్ మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నికలు
నగిరి మున్సిపాలిటీలకు 36 వార్డు సభ్యుల ఎన్నికలు,66 పోలింగ్ స్టేషన్లకు సిద్ధం
పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
—జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు,అక్టోబర్31(గరుడదాత్రిన్యూస్)జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నగరపాలక మున్సిపల్ మేయర్. చైర్మన్. కార్పొరేట్లకుసంబంధించి ఎన్నికలు. మున్సిపాలిటీల చైర్మన్ ల ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఓటర్లు నిర్భయంగా ఓటును సద్వినియోగం చేసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ పీవీకేఎన్.డిగ్రీ కళాశాల నందు పోలింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రంలో పోలింగ్ పరికరాల పంపిణీని పరిశీలించారు. అక్కడ సిబ్బందిని పలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూసమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, ఆయా ప్రదేశాలలోఅదనపు భద్రతాచర్యలుతీసుకున్నామన్నారు. ఒకొక్క పోలింగ్ స్టేషన్ లలో ప్రిసైడింగ్ అధికారి, అదనపు ప్రిసైడింగ్ అధికారితో పాటు, ముగ్గురు ఇతర పోలింగ్ సిబ్బందిని,మైక్రోపరిశీలకులనునియమించామన్నారు. వీరికి 2సార్లు పోలింగ్ ప్రక్రియపై 2సార్లు శిక్షణ అందించడం జరిగిందని, పోలింగ్ పరికరాలతోపాటు, వాహనాలలో పోలింగ్ స్టేషన్ కి పంపడం జరుగుతుందన్నారు. బస్సులో రూట్ అధికారిని కూడా పంపడం జరుగుతుందన్నారు. నవంబర్,1వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాన్ని పోలింగ్ నిమిత్తం సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు నిర్దేశించిన సమయంలోగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోమొత్తం 60కి 51 డివిజన్లు ఏకగ్రీవంగా.. 21, 22, 27, 31, 32, 42, 44, 46, 53 డివిజన్లో పోలింగ్ జరగనుంది.మేయర్ పదవికి ఆరుగురు పోటీలో ఉన్నారు.పోలింగ్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి జనం గుమిగూడకూడదు చిత్తూరులోఓటర్లు: 1,48,583 మంది
పోలింగ్ కేంద్రాలు: 175 ,25, రూట్లు, అని వివరించారు
ఈ కార్యక్రమంలో వయ్య పరిశీలకులు సదానందం, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్,, ఆర్వో పుల్లారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస నాయుడు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
