ePaper
Sunday, November 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ముగిసిన ఏఐసిటిఈఆటల్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ముగిసిన ఏఐసిటిఈఆటల్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

📰 Generate e-Paper Clip

పూతలపట్టుఅక్టోబర్ 31(గరుడధాత్రిన్యూస్) చిత్తూరు జిల్లా పి.కొత్తకోట సమీపంలోని వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (ATAL) అకాడమీ ఆధ్వర్యంలో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించిన ఆరు రోజుల బేసిక్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) శనివారం ఘనంగా ముగిసింది. అక్టోబర్ 26 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ఆరు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు అవకాశాలు తదితర అంశాలపై నిపుణులు తమ విలువైన పరిజ్ఞానాన్నిపంచుకున్నారు.
ప్రముఖ విద్యాసంస్థలు పరిశ్రమలకు చెందిన నిపుణులు వివిధ సాంకేతిక అంశాలపై తమ అనుభవాలను, పరిశోధన ఫలితాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాల్గొన్న అధ్యాపకులతోపంచుకున్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్నిపెంపొందించడంలో AI వినియోగం, హైడ్రోజన్ నిల్వ, రవాణా AI ఆధారిత సుస్థిర ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలలో నూతన అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ కార్యక్రమ ముగింపు వేడుకకు కళాశాల ప్రిన్సిపాల్ డా. నవీన్ కిలారి ముఖ్య అతిథిగా, వైస్ ప్రిన్సిపాల్ డా. డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ,భవిష్యత్తులో ఇంధన రంగంలో గ్రీన్హైడ్రోజన్,పునరుత్పాదక ఇంధన వనరులు మరియు కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అధ్యాపకులు ఇటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ బోధన, పరిశోధన మరియు విద్యార్థుల ప్రాజెక్టులలో అన్వయించుకోవాలని సూచించారు ఎఫ్ డి పికోఆర్డినేటర్లు డా.ఎ. హేమశేఖర్ కో-కోఆర్డినేటర్ శ్రీ ఎం. మురళి కార్యక్రమ నిర్వహణలో తమ అనుభవాలనుపంచుకుంటూ, ఆరు రోజుల పాటు జరిగిన సాంకేతిక కార్యక్రమాలముఖ్యాంశాలను వివరించారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, వనరుల నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఆరు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు సుస్థిర ఇంధన రంగంలో మరిన్ని అవకాశాలకు మార్గదర్శకంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!