ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జ్ఞాన జ్యోతి సమగ్రాభివృద్ధిపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ

జ్ఞాన జ్యోతి సమగ్రాభివృద్ధిపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ

📰 Generate e-Paper Clip

ఐరాల ఆగస్టు 11 (గరుడ ధాత్రి న్యూస్)

జ్ఞాన జ్యోతి సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ నిర్మల తెలిపారు. మంగళవారం ఐరాల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీలకు మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఐరాల ఎం,ఈ,ఓ ,2, భాను ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీలు చెప్పిన విషయాలను నేర్చుకుని ప్రతి పిల్లవాడికి చదవడం రాయడం నేర్పించాలని అన్నారు. గతంలో నేర్చుకున్న విషయాలను నెమర వేసుకోవాలన్నారు.
కొత్త విషయాలు నేర్చుకుని పిల్లల సమగ్ర అభివృద్ధికై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి,జనార్ధన్, సుధాకర్, అరుణ్ కుమార్, ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ మంజుల, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!