చిత్తూరు అక్టోబర్ 10 (గరుడదాత్రిన్యూస్)చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాలెం గ్రామానికి చెందిన మంజునాథ్ ఆరోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పందించి ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడారు.ఆసుపత్రి బిల్లు రూ.8లక్షలు సర్దుబాటు చేయించారు. శనివారం తుమ్మిందపాలెం వెళ్లి మంజునాథ్భౌతికకాయానికి పూలమాలవేసినివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.50వేలు సాయం అందించారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
