ePaper
Saturday, October 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచౌడేపల్లిలో ఘనంగా ఎస్ కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు

చౌడేపల్లిలో ఘనంగా ఎస్ కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 10 గరుడదాత్రి న్యూస్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఎస్ కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు చౌడేపల్లి పట్టణంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమణారెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంచిపెట్టారు. సమాజ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రమణారెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ప్రజా సేవలు చేయాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సోమల సురేష్ (రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి)
శ్రీనివాసులు నాయుడు గారు (సోమల ఏఎంసీ చైర్మన్)
ఆసూరి బాలాజీ (మాజీ రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు)
షేక్ ఇబ్రహీం (అంజుమాన్ కమిటీ సెక్రటరీ)
వీరితో పాటు పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై ఎస్ కే రమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!