బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16
బైరెడ్డిపల్లి లోని టి .బి.వ్యాధి గ్రస్థులకు చేయూత ఇస్తున్న
శాంతి హెల్త్ ,మహతి ఫౌండేషన్ పై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.దాతలు ప్రతి నెల టి.బి.వ్యాధి ఉన్నవారుకి మరియ కీర్తిశేషులు బి రమణ మండల అభివృద్ధి అధికారి బైరెడ్డిపల్లి వారి జ్ఞాపకార్థం పోషకాహారం డ్రైఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ నెలకు సరిపడా అవసరమైన మందులు మాస్కులు విటమిన్ సిరప్,ఓ.ఆర్.ఎస్, మాత్రలు మొదలగునవి పంపిణీ చేస్తూ మానవత్వం చాటుకొంటున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం బైరెడ్డిపల్లి లో ఈ సేవా కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆరోగ్య విద్య పై అవగాహన కల్పించారు.జిల్లా టీబీ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ ధాతలను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డా విజయ్ చందర్ ప్రియాంక , మహతి ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాసులు డాక్టర్ శాలిని, సి.హెచ్.ఓ.జయంఠీ,
సుపర్ వైజర్ సరమతి , జిలానీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టి .బి.వ్యాధి గ్రస్థులకు చేయూత ఇస్తున్న శాంతి హెల్త్ ,మహతి ఫౌండేషన్ పై ప్రశంసల జల్లు
RELATED ARTICLES
